అత్తింటి వేధింపులను తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.... ప్రకారం వివాహమై రెండేళ్లు కావస్తున్న పిల్లలు పుట్టడం లేదని నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా లేదా మరో ఎవరినైనా పెళ్లి చేసుకుంటా నాకు విడాకులు ఇవ్వమంటూ భార్యను వేధింపులకు గురిచేశాడు ఓ దుర్మార్గపు భర్త.. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన భూక్యా రేణుక కు, టేకులపల్లి మండలం దంతాల తండా కు చెందిన భూక్య బాబూలాల్ కు 2022లో వివాహమైంది... రెండేళ్లు అయినా సంతానం కలుగకపోవడంతో అత్తింటి వారు వేధింపులకు దిగారు.. కుటుంబసభ్యులు నువ్వు గొడ్రాలివి.. అంటూ హింసించడం మొదలు పెట్టారు. నీవు విడాకులు ఇస్తే బాబూలాల్ కు మరో పెళ్లి చేస్తామని రేణుక ను కుటుంబసభ్యులు ఒత్తిడి చేశారు.. రేణుక విడాకులు ఇస్తే సరే, లేదంటే రేణుక చెల్లి కళ్యాణి ని ఇచ్చి వివాహం చేయాలని షరతులు పెట్టి హింసించారని మృతురాలి కుటుంబసభ్యలు ఆరోపించారు.
ALSO READ | జింకను చంపిన కేసులో ఆరుగురు అరెస్ట్
పిల్లల విషయంలో రేణుకకు, భర్తతో.. అత్తమామలతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో రేణుక పుట్టింటికి వెళ్లింది. తల్లిదగ్గరే జీవిస్తుంది. అత్తింట్లో జరిగిన గొడవలు ఆమెను మానసిక క్షోభకు గురి చేయడంతో సెప్టెంబర్ 27న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పొలాల్లో కలుపునకు జల్లే మందును తాగి రేణుక తాగింది. దీనిని గమనించిన కుటుంబసభ్యలు పాల్వంచ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం.. తరువాత మెరుగైనచికిత్సకోసం.. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రేణుక చికిత్స పొందుతూ గురువారం ( అక్టోబర్ 3) మరణించింది.
రేణుక వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో కూడా భర్త బాబూలాల్ రాలేదని మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేణుక చనిపోతూ... తన మరణానికి భర్త బాబూలాల్.. అతని కుటుంబసభ్యులు కారణమని మరణవాంగ్మూలం ఇచ్చింది. రేణుక తల్లి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.