బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య..సుప్రీంకోర్టును కూడా కదిలించింది. మహిళలు చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పింది. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి విడాకుల కేసు విచారిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే అన్ని కేసులు ఇలాంటివే కావని..కొన్ని నిజమైన వేధింపుల కేసులు ఉన్నాయని స్పష్టం చేసింది. అదేసమయంలో బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ కేసులో తనకు న్యాయం చేయాలని వస్తున్న డిమాండ్ల క్రమంలో సుప్రీంకోర్టు సెక్షన్ 198ఎ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది.
బార్ అండ్ బెంచ్ రిపోర్ట్ ప్రకారం.. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి విడాకుల కేసును మంగళవారం విచారణ చేపట్టింది. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 498A చట్టా న్ని మహిళలు..భర్త వారి బంధువులను వేధించేందుకు దుర్వినియోగం చేస్తున్నారని స్పష్టం చేసింది.
జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 498ఎ చట్టం దుర్వినియోగం పై ఆందోళన వ్యక్తం చేసింది.కొంత మంది మహిళ లు భర్త, అతని కుటుంబాన్ని వేధించేందుకు ఉపయోగించుకుంటున్నారని తెలిపింది. భర్త, అతని కుటుంబంపై వ్యక్తిగత ప్రతీకారాన్ని తీర్చుకునేం దు కు మహి ళలు ఈ నిబంధనను ఓ సాధనంగా వినియోగించుకుంటున్న ధోరణి ఓ ట్రెండ్ లామారిందని కోర్టు పేర్కొంది.
ALSO READ | ఎవరీ నికితా సింఘానియా..? ట్రెండింగ్‌లో యాక్సెంచర్ ఐటీ కంపెనీ.. !
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వైవాహిక జీవితాలకు సంబంధించిన వివాదాలు గణనీయంగా పెరుగుతున్నందుకు ఐపీసీ సెక్షన్ 498ఎ నిబంధనలు దుర్వినియోగం చేసే ధోరణి పెరుగుతోంది. భార్యభర్తల మధ్య గొడవల్లో అస్పష్టమైన ఆరోపణలు చేయడం, వాటిని పరిశీలించకపోతే చట్టపరమైన ప్రక్రియలను 498 ఎ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా భర్త, ఆమె కుటుంబ సభ్యులను చేయి మెలితిప్పే విధంగా వ్యూహాలను ఉపయోగించడం వంటి ప్రోత్సహించబడుతున్నాయని.. విడాకుల తీర్పు సమయంలో కోర్టు వ్యాఖ్యానించింది.
చట్ట సభలు,లాయర్లు ఏమంటున్నారంటే..
498ఎ చట్టం దుర్వినియోగంపై ప్రముఖ లాయర్ ఆశిష్ దీక్షిత్ మాట్లాడుతూ.. ప్రతి కేసులో మహిళలు చేస్తున్న ఆరోపణలల్లో వాస్తవం ఉంటుందని భావించకూడదు. ఈ విషయాన్ని క్రిమినల్ లా ప్రాక్టీస్ చేసే ఏ లాయర్ అయిన 498ఎ చట్టం ఏవిధంగా దుర్వినియోగం అవుతుందో అనేక కేసులను చూపగలరు.చట్టాన్ని పునపరిశీలించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కొన్ని సంస్కరణలు అవసరం అని చెప్పారు.
అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ ఢిల్లీకి చెందిన లాయర్ వికాస్ పహ్వా మాట్లాడుతూ..“న్యాయవాదులు, పోలీసు యంత్రాంగం, అసంతృప్త మహిళలు 498Aని ఎలా దుర్వినియోగం చేశారో నేను చూశాను అని చెప్పారు.
‘‘అతుల్ కేసు 498ఎ చట్టంపై వివాదాన్ని రేకెత్తించింది.. సమస్యను తెరపైకి తెచ్చింది. 498ఎ దుర్వినియోగం జరుగుతుందనేది దానికి అతుల్ కేసు ఓ ఉదాహరణ.. ఇది సమాజంలోని సామాజిక నిర్మాణంపై ప్రభావం చూపుతుందని ’’ వికాస్ అన్నారు.
ALSO READ | మంచు తుఫాను: మోహన్ బాబుకు పెరిగిన హార్ట్ రేట్.. మంచు విష్ణు సీరియస్ వార్నింగ్..
‘‘అతుల్ కేసులో భర్తపైనేకాదు.. అత్త, మామ, కోడలు, బావమరిదిపై కూడా తప్పుడు ఆరోపణలు చేశారు..వారిపై కూడా కేసులు పెట్టారు. వాటిలో చాలా వరకు అబద్ధాలే’’ అని అన్నారు.
మరోవైపు అతుల్ సుభాష్ కేసును సుమోటోగా స్వీకరించాలని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కోర్టును కోరారు. “ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు దేశంలో మరలా జరగకూడదు..సామాన్యుడికి న్యాయం జరుగుతుందన్న ఆశ లేకుంటే అది సమాజానికి చాలా హానికరం. అమలు చేసే సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని రేణుకా చౌదరి అన్నారు.