వర్క్- లైఫ్ బాలెన్స్ కోసం.. కొలీగ్ నే పెళ్లి చేసుకోండి.. బెంగళూర్ టెకీ మాటలు వైరల్..!

వర్క్- లైఫ్ బాలెన్స్ కోసం.. కొలీగ్ నే పెళ్లి చేసుకోండి.. బెంగళూర్ టెకీ మాటలు వైరల్..!

సిటీ లైఫ్ లో ప్రతి ఒక్కరూ అప్పుడో ఇప్పుడో ఫీల్ అయ్యే అంశం ఫ్యామిలీ బ్యాలెన్స్. ఉద్యోగం చేస్తేనే నడవని పరిస్థితి సిటీలో. అలాంటప్పుడు అటు ఆఫీస్ ను ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం కష్టం గా ఉంటుంది. ఈ సమస్యలను అధిగమించాలంటే ఇండియన్ ఎంప్లాయ్స్ కొలీగ్ నే పెళ్లి చేసుకోవాలని బెంగళూర్ కు చెందిన టెకీ ఇచ్చిన సలహా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

లింక్డిన్ టెకీ, స్టాండప్ కమెడియన్ అయిన హర్షిత్ మహవీర్ కొలీగ్ ను పెళ్లి చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో లిస్ట్ రెడీ చేశాడు. ఇప్పుడు ఇతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ క్రియేట్ చేశాయి. కొలిగ్ ను పెళ్లి చేసుకుంటే క్యాబ్ ఖర్చులు తగ్గించుకోవచ్చునట. ఇద్దరూ కొలీగ్స్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని ఫీల్ అవ్వొచ్చునట. ఆపీస్ లో బోర్ అనిపించినపుడు పెళ్లాంతో సరసాలు కూడా ఆడొచ్చునని కాస్త కామెడీ యాడ్ చేసి చెప్పాడు ఈ టెకీ. అన్నింటికంటే ముఖ్యంగా వివాహేతర సంబంధాలను కంట్రోల్ చేయడంలో కూడా ఇది వర్కవుట్ అవుతుందని చెప్పాడు. 

ALSO READ | భర్తను ముక్కలు ముక్కలు నరికి చంపి ప్రియుడితో హోలీ.. మర్చంట్ నేవీ ఆఫీసర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు

‘‘ఇండియాలో జాబ్స్ పరిస్థితి బాలేదు. ఘోరమైన ఒత్తిడి. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి సమయం సరిపోదు. ఒకవేళ జాబ్ మానేస్తే.. ప్యామిలీ మీతో మాట్లాడటం మానేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను చెప్పే సింపుల్ సొల్యుషన్.. కొలీగ్ ను పెళ్లి చేసుకోవడమే’’ అని మహవీర్ పోస్ట్ చేశాడు. 

దీనిపై కొందరు పాజిటివ్ గా.. కొందరు నెగెటివ్ గా ట్రోల్ చేస్తూ పెద్ద డిబేట్ నడుస్తోంది ఈ అంశంపై. ‘‘కొలీగ్ ను పెళ్లి చేసుకోవడం కాదు.. కాపురం కూడా అక్కడే పెడితే కరెంట్ బిల్లుఉండదు.. రెంట్ కట్టాల్సిన పనిలేదు.. అంతా ఫ్రీ ఫ్రీ..’’ అని కొందరుకామెడీ చేస్తున్నారు . పెళ్లి చేసుకుని మీ టీమ్ లో జాయిన్ చేసుకోండి. రెఫరల్ బోనస్ కూడా వస్తుందని మరొకరు కామెంట్ చేశారు. 

‘‘బ్రిల్లియంట్ ఐడియా. మెటర్నల్ బెనిఫిట్స్ గురించి HR టీమ్ రూల్స్ లో మెన్షన్ చేస్తారేమోనని వెయిట్ చేస్తున్నాం. అది ఉంటే కచ్చితంగా చేసుకుంటాం’’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘‘గ్రేట్ఐడియా.. కొత్త ఆఫీస్ కల్చర్ ను ప్రమోట్ చేస్తున్నారు’’ అని కొందరు మెచ్చుకుంటున్నారు. ‘‘అయితే కొందరు ఇంట్లో పోట్లాట సరిపోదని ఆఫీస్ లో జరగాలా గొడవలు’’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. 

ఏదైతేనేం.. ఈ ఐడియా చాలా మందికి తెలిసినా.. ఇప్పుడు మహవీర్ ఇచ్చిన లిస్ట్.. చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.