
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారకుడు (కుజుడు) కన్యారాశిలోకి ఆగస్ట్ 18 న ప్రవేశించాడు. కుజుడు (అంగారకుడు) ధైర్యం, శౌర్యం, దాంపత్యం, సంతోషం, భూమికి కారకుడిగా చెబుతుంటారు. జాతకంలో కుజుడు శుభప్రదంగా ఉంటే, ఆ వ్యక్తి బలవంతుడు, నిర్భయుడు, ధనవంతుడు అవుతాడు. దాంపత్య సుఖాన్ని అనుభవిస్తాడు. కుజుడు కన్యారాశిలో సంచారం పెద్ద మార్పును తెస్తుంది. అంగారకుడి సంచారం కొంత మందికి అనుకూలంగానూ, కొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది.
మేషరాశి
కుజుడు కన్యారాశిలో సంచారం వలన మేషరాశి వారికి అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో మీరు చేసే పనులు అన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారని జ్యోతిష్య పండితులు అంటున్నారు. కుటుంబ జీవితంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి కుజుడు కన్యారాశిలో సంచారము ప్రతికూల ఫలితాలుంటాయంటున్నారు పండితులు. ఆవేశాలను తగ్గించుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్కేులు చెబుతున్నారు.
మిధునరాశి
మిథున రాశి వారికి ఈ మార్స్కుజుడు కన్యారాశిలో సంచారం శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశం కలదు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంది.
కర్కాటకరాశి
కర్కాటకరాశి వారికి కన్యారాశిలో అంగారకుడి సంచారం అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా ఆదాయం వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పండితులు సూచిస్తున్నారు.
సింహరాశి
కన్యారాశిలో అంగారకుడి సంచారం సింహరాశి వారు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటున్నారు. అనవసరంగా ఎవరితోనే వాదన పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
కన్యారాశి
కన్యారాశిలో కుజుడు సంచారం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటున్నారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ఆలోచచను మానుకోమని సలహా ఇస్తున్నారు. కోపం కారణంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటున్నారు పండితులు.
తులారాశి
కన్యారాశిలో కుజుడు సంచారం తుల రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా అస్థిరంగా ఉంటుంది. ఉద్యోగులు అవమానాలకు గురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగవద్దని సూచిస్తున్నారు.
వృశ్చికరాశి
కన్యారాశిలో కుజుడు సంచారం వలన వృశ్చిక రాశి వారి జీవితాలపై మిశ్రమ ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది . గతంలో చేసిన పెట్టుబడి నుండి కూడా మంచి రాబడిని పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కన్యారాశిలో కుజుడు సంచారం అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆర్దికంగా వచ్చే ఇబ్బందులను అధికమిస్తారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని పండితులు సూచించారు.
మకరరాశి
కన్యారాశిలో కుజుడు సంచారం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులు సాధించాలంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ విభేదాలను పరిష్కరించడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి
కన్యారాశిలో కుజుడు సంచారం వలన కుంభరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్దికంగా బాగున్నప్పటికి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఓపికగా ఉండి కష్టపడి పని చేస్తే శుభ ఫలితాలను పొందుతారని పండితులు అంటున్నారు.
మీనరాశి
కన్యారాశిలో కుజుడు సంచారం వలన మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు కోపాన్ని అదుపులో ఉంచుకొని.. దుబారా ఖర్చుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సూచిస్తున్నారు.