ఆకాశంలో అద్భుతం : ఒకే కక్ష్యలోకి నాలుగు గ్రహాలు.. 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలా..!

ఆకాశంలో అద్భుతం : ఒకే కక్ష్యలోకి నాలుగు గ్రహాలు.. 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలా..!

సౌర మండలం ఎన్నో వింతలు... విశేషాలకు వేదికగా ఉంటుంది.  మరికొద్ది రోజుల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.  వీటి మర్మం తెలుసుకోడానికి శతాబ్దాల నుంచి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు .జనవరి 17,18 తేదీల్లో  సమాంతర రేఖలో నాలుగు గ్రహాలు రానున్నాయని ఖగోళశాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ఇలా 100 సంవత్సరాలకు ఒకసారి ఆకాశంలో కనువిందు చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.   ఆ సమయంలో అరుదైన గ్రహ చతుష్టయం ఆకాశంలో దర్శనమివ్వనుంది.  శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని  గ్రహాలు ఒకే రేఖపై కనువిందు చేయనున్నాయి.  

 సౌర వ్యవస్థలో ఒకే ప్రాంతంలో ఒకే వరుసలోకి గ్రహాలు వచ్చే క్రమాన్ని ప్లానెట్ పరేడ్ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిస్టులు  తెలిపిన వివరాల ప్రకారం...  జనవరి 17, 18 తేదీల్లో  నాలుగు గ్రహాలు ఒకే రేఖపైకి వస్తాయి.  ఇవి సూర్యాస్తమయం తరువాత అంగారకుడు, శుక్రుడు, శని, బృహస్పతి అసాధారణ వీక్షతను అందిస్తాయని  చెబుతున్నారు.  నైరుతి దిక్కులో శుక్రుడు.. శని కలిసి ఉంటారు.  అలాగే బృహస్పతి ఆకాశంలో ప్రకాశవంతంగా మెరుస్తూ గ్రహాల శ్రేణిలో తిరుగుతుంటాయి. . ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. 

Also Read :- పొగమంచు ఎఫెక్ట్.. 200 విమానాలు ఆలస్యం

ఆ రోజుల్లో  శని.. శుక్రుడు ఈ రెండు గ్రహాలు చాలా దగ్గరిగా కనపడతాయి. జనవరి 15, 16 తేదీల్లో అంగారకుడు ప్రకాశవంతంగా కనపడతాడని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.1.4 మాగ్నిట్యూడ్‌తో అంగారక గ్రహం అనేక నక్షత్రాలను అధిగమిస్తుంది. నాలుగు గ్రహాలు ఒకే సరళరేఖపైకి రావడం  చాలా అరుదుగా జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఈ గ్రహాలన్నీ భూమి నుంచి చూస్తే దగ్గరగా ఉన్నట్టు కనిపించినా.. వాటి మధ్య దూరం బిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో వీటి కక్ష్య మార్గంలో చోటుచేసుకునే మార్పులతో ఇలాంటి విశేషాలు ఏర్పడతాయి.