ఘట్ కేసర్, వెలుగు: ఐస్ క్రీమ్ అడిగిన దంపతులపై మార్ట్ సిబ్బంది దాడి చేసి గాయపరిచారు. ఘట్ కేసర్ ఎస్ఐ రాము నాయక్, బాధితులు తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ టౌన్ ఎదులాబాద్ రోడ్డులో కృష్ణ మార్ట్ లో సోమవారం రాత్రి 9 గంటలకు యంనంపేట్ కు చెందిన అరిగే సాయికుమార్, సోనీ దంపతులు కూతురు కలిసి సరుకులు కొనేందుకు వెళ్లారు. టైమ్ అయిపోయిందని మార్ట్ సిబ్బంది దురుసుగా మాట్లాడారు.
ఐస్ క్రీమ్ అయిన ఇవ్వాలని అడగగా ఇవ్వమని చెప్పారు. షాప్ మూసి వేయలేదు కదా ఎందుకు ఇవ్వరని అడగడంతో ఆగ్రహానికి గురైన మార్ట్ సిబ్బంది దంపతులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాధితుని బంధుమిత్రులు వచ్చి మార్ట్ వద్ద ఆందోళన దిగారు. షట్టర్లను తెరిచి దాడికి యత్నించటంతో భయాందోళనకు గురైన మార్ట్ సిబ్బంది పరుగులు తీశారు. పోలీసులు వెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అడ్మిన్ ఎస్ఐ రాము నాయక్ హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.