ENG vs NZ: ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. ట్రోఫీకి దిగ్గజాల పేర్లు ప్రకటన

ENG vs NZ: ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. ట్రోఫీకి దిగ్గజాల పేర్లు ప్రకటన

ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 28 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. గురువారం (నవంబర్ 28) నుంచి హేగ్లీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ కు ప్రారంభానికి ముందు ట్రోఫీకి కొత్త ట్రోఫీని ప్రకటించారు. ఈ ట్రోఫీ పేరును క్రోవ్-థోర్ప్ గా ప్రకటించారు. డేవిడ్ న్గావతి రూపొందించిన ఈ ట్రోఫీని ఇద్దరు దిగ్గజాల బ్యాట్‌లలో కొంత భాగాన్ని ఉపయోగించి తయారు చేశారు. ఇప్పటికే క్రికెట్ లో గాంధీ-మండేలా ట్రోఫీ.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, యాషెస్ ట్రోఫీలు ఉన్న సంగతి తెలిసిందే.     

ఈ ఏడాది ప్రారంభంలో ఆగస్టులో మరణించిన థోర్ప్.. ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు ఆడాడు. మరోవైపు మార్టిన్ క్రో న్యూజిలాండ్ టెస్ట్ జట్టులో దిగ్గజ ప్లేయర్.  ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ను ప్రకటించారు. ఇటీవలే న్యూజిలాండ్ భారత్ పై మూడు టెస్టుల సిరీస్ ను 3-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్ కు విలియంసన్ కూడా అందుబాటులో ఉండడంతో సొంతగడ్డపై న్యూజిలాండ్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇక ఇంగ్లాండ్ గత నెలలో పాకిస్థాన్ పై  టెస్ట్ సిరీస్ ను 1-2 తేడాతో ఓడిపోయి ఒత్తిడిలో కనిపిస్తుంది. 

షెడ్యూల్:

మొదటి టెస్ట్ (నవంబర్ 28- డిసెంబర్ 02): క్రైస్ట్ చర్చ్

రెండో టెస్ట్ (డిసెంబర్ 06 - 10): వెల్లింగ్‌టన్‌

మూడో టెస్ట్ (డిసెంబర్ 14- 18): హామిల్టన్‌

ఇంగ్లండ్ జట్టు:

బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైసన్ కార్సే, జోర్డాన్ కాక్స్(వికెట్ కీపర్), జాక్ క్రాలే, బెన్ డకెట్, జాక్ లీచ్, ఆలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్ , ఆలీ స్టోన్, క్రిస్ వోక్స్.

న్యూజిలాండ్ జట్టు 

టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (2,3వ టెస్టులు), నాథన్ స్మిత్, టిమ్ సౌతీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్