ఆక్లాండ్ : న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏండ్ల గప్టిల్ ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్స్‌లో కొనసాగనున్నాడు. కివీస్ తరఫున చివరగా 2022లో బరిలోకి దిగిన మార్టిన్ 47 టెస్టులు ఆడినా ఎక్కువ సక్సెస్ అవ్వలేదు. 198 వన్డేల్లో 7346 రన్స్ చేశాడు. ఇందులో 18 సెంచరీలు, 39 ఫిఫ్టీలు ఉన్నాయి.
122 టీ20ల్లో 2 సెంచరీలు, 18 ఫిఫ్టీలు సహా 3531 రన్స్ చేశాడు. అరంగేట్రం వన్డేలోనే సెంచరీ చేయడంతో పాటు ఈ ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ కొట్టిన కివీస్
తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.