తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైనవారికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రతిష్ఠాత్మక అమరవీరుల స్మారకచిహ్నం భవనంలో రెండు బేస్ మెంట్ సహా గ్రౌండ్ ఫ్లోర్, మూడు అంతస్తులు ఉన్నాయి.
- బేస్‌మెంట్-2 – 1,06,993 చ.అ వైశాల్యం. (175 ఫోర్ వీలర్లు, 200 టూ వీలర్ల పార్కింగ్, లాంజ్, లిఫ్ట్, 3 లక్షల లీటర్ల సంప్)
- బేస్‌మెంట్-1 – 1,06,993 చ.అ వైశాల్యం. (160 ఫోర్ వీలర్లు, 200 టూ వీలర్ల పార్కింగ్, లాంజ్ ఏరియా, డైవర్లు, సెక్యూరిటీ రూములు)
- గ్రౌండ్ ఫ్లోర్- 28,707 చ.అ విస్తీర్ణం. (మెయింటనెన్స్ రూమ్‌లు, చిల్లర్ ప్లాంట్, ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు అవసరమైన ఏరియా, స్టోర్ రూమ్‌లు, కిచెన్, కోల్డ్‌స్టోరేజీ)
- మొదటి అంతస్థు- 10,656 చ.అడుగులు. (మ్యూజియం, ఫొటో గ్యాలరీ, 70మందికి సరిపడా ఆడియో విజువల్ రూమ్, ఎస్కలేటర్)
- రెండవ అంతస్థు – 16,964 చ.అడుగుల విస్తీర్ణం. (సుమారు 500 మంది సామర్ధ్యంగల కన్వెన్షన్ హాలు, లాబీ ఏరియా)
- మూడవ అంతస్థు, టెర్రస్ ఫ్లోర్- 8095 చ.అడుగుల విస్తీర్ణం. (రెస్టారెంట్, ఓపెన్ టెర్రస్ సిట్టింగ్ ఏరియా)
- మెజనైన్ ఫ్లోర్- 5900 చ.అడుగుల విస్తీర్ణం. (గ్లాస్ రూఫ్ రెస్టారెంట్, ఓవర్‌హెడ్ ట్యాంక్)
- దీపం- కార్బన్ స్టీల్‌తో నిర్మాణం, 26 మీటర్ల ఎత్తు. గోల్డెన్ ఎల్లో కలర్, ఎక్స్‌టర్నల్ లైటింగ్
- బేస్‌మెంట్-2 నుంచి నాలుగవ అంతస్థు వరకు మూడు లిఫ్టులు