రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే తన తండ్రిని హత్య చేశారని జగిత్యాలలో హత్యకు గురైన మారు గంగారెడ్డి కూతురు శరణ్య అన్నారు. మా నాన్న హత్య వెనుక కుట్ర కోణం దాగి ఉంది. దీని వెనుక ఎవరున్నారో బయటపెట్టాలి. గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేసిన మా నాన్న బతికుంటే అక్రమార్కుల ఆటలు సాగవని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో వైపు గంగారెడ్డి హత్య ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు జగిత్యాల డీఎస్పీ రఘు చందర్. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అన్ని కోణాల్లో లోతైన విచారణ జరుగుతుందన్నారు. మర్డర్ వెనుక ఎవరు ఉన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ALSO READ | జగిత్యాలలో కాంగ్రెస్ నేత హత్య.. నిందితులను శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన
అక్టోబర్ 22న జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ మారు గంగారెడ్డిని ఓ వ్యక్తి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.హత్యకు గురైన రంగారెడ్డి ఎమ్మెల్సీజీవన్ రెడ్డిక ప్రధాన అనుచరుడు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలతో రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు.