హైదరాబాద్, వెలుగు : డ్రోన్ టెక్నాలజీ కంపెనీ మారుత్ డ్రోనెటెక్, లోక్ క్యాపిటల్ నుంచి సిరీస్ ఏ ఫండింగ్‌లో 6.2 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.52 కోట్లు) సేకరించింది. కస్టమర్ అవసరాలకు అనుగుణంగా అధునాతన వ్యవసాయ డ్రోన్‌ల అభివృద్ధి, గ్రామీణ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు తన ఛానెల్ పార్టనర్ నెట్‌వర్క్‌ను పెంచడం
సేవా కేంద్రాలను టైర్ 2,-3 నగరాల్లోకి విస్తరించడం, డ్రోన్ అగ్రికల్చర్ సర్వీస్ హబ్‌లను ఏర్పాటు చేయడానికి ఈ డబ్బును వాడుతుంది. భాగస్వామ్య విధానంతో డ్రోన్- యాజ్-ఎ -సర్వీస్‌ను ఆఫర్ చేస్తున్నామని మారుత్‌డ్రోన్స్ ప్రకటించింది.