మారుతి కార్ల ధరలు.. రూ.62 వేల వరకు పెంపు

మారుతి కార్ల ధరలు.. రూ.62 వేల వరకు పెంపు

న్యూఢిల్లీ: మారుతి సుజుకీ ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి కార్ల ధరలను రూ.2,500 నుంచి 62 వేల వరకు పెంచుతోంది. ఇన్​పుట్​ఖర్చులు, ఆపరేషనల్​ఖర్చులు పెరగడం, రూల్స్​మారడం, కొత్త ఫీచర్లను చేర్చాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది. కాంపాక్ట్ ఎస్​యూవీ ఫ్రాంక్స్ ధరను రూ.2,500, డిజైర్ టూర్ ఎస్​ ధరను రూ.మూడు వేలు, ఎక్స్​ఎల్​6  ఎర్టిగా ధరను రూ.12,500 పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. 

కాంపాక్ట్ మోడల్ వ్యాగన్ ఆర్​ ధరను రూ.14వేలు, ఈకో వ్యాన్ ధరను రూ.22,500 పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఎస్​యూవీ గ్రాండ్ విటారా ధర ఏప్రిల్ 8 నుంచి రూ.62వేలు పెరుగుతుంది. ఇండియా మార్కెట్లో మారుతి సుజుకి ఎంట్రీ- లెవల్ ఆల్టో కే-10 నుంచి ఇన్విక్టో వరకు పలు మోడళ్లను విక్రయిస్తున్నది. మారుతి సుజుకి షేర్లు బుధవారం  2.09 శాతం పెరిగాయి. 

మారుతి సుజుకీ ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి కార్ల ధరలను రూ.2,500 నుంచి 62 వేల వరకు పెంచుతోంది. ఇన్​పుట్​ఖర్చులు, ఆపరేషనల్​ఖర్చులు పెరగడం, రూల్స్​మారడం, కొత్త ఫీచర్లను చేర్చాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది. కాంపాక్ట్ ఎస్​యూవీ ఫ్రాంక్స్ ధరను రూ.2,500, డిజైర్ టూర్ ఎస్​ ధరను రూ.మూడు వేలు, ఎక్స్​ఎల్​6  ఎర్టిగా ధరను రూ.12,500 పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. 