ఒక్క ఏడాదిలో 20 లక్షల కార్ల తయారీ .. మారుతి సుజుకి రికార్డు

ఒక్క  ఏడాదిలో 20 లక్షల కార్ల తయారీ .. మారుతి సుజుకి రికార్డు

న్యూఢిల్లీ: ఆటోమొబైల్​కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా 2024లో తొలిసారిగా ఒక క్యాలెండర్ ఇయర్‌‌లో 20 లక్షల ఉత్పత్తి మార్కును అధిగమించినట్లు తెలిపింది.  కంపెనీ మనేసర్ ఆధారిత తయారీ కేంద్రం వద్ద ఉత్పత్తి లైన్ నుంచి 20 లక్షలవ యూనిట్​ను మంగళవారం విడుదల చేసింది.   20 లక్షల వాహనాల్లో దాదాపు 60 శాతం హర్యానాలో, 40 శాతం గుజరాత్‌‌లో తయారయ్యాయని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌‌ఐ) తెలిపింది.  

బాలెనో, ఫ్రాంక్స్, ఎర్టిగా, వ్యాగన్ఆర్,  బ్రెజ్జా 2024లో కంపెనీ తయారు చేసిన టాప్–5  వాహనాలు. ఈ విజయం  ఆర్థిక వృద్ధిని నడపడానికి, దేశ నిర్మాణానికి  కీలకమని ఎంఎస్​ఐ మేనేజింగ్ డైరెక్టర్ హిసాషి టేకుచి అన్నారు. కంపెనీ హర్యానాలో రెండు (గుర్గావ్  మనేసర్), గుజరాత్ (హంసల్‌‌పూర్)లో ప్లాంటును నడుపుతోంది. వీటిలో ఏటా 23.5 లక్షల యూనిట్లను తయారు చేయవచ్చు.