న్యూఢిల్లీ : గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో మారుతి సుజుకీ న్యూ డిజైర్ ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకుంది. కారులో పెద్దవారు ట్రావెల్ చేస్తున్న పరిస్థితుల్లో ఫైవ్ స్టార్, చిన్నపిల్లలు ట్రావెల్ చేస్తున్న పరిస్థితుల్లో ఫోర్ స్టార్ రేటింగ్ పొందింది.
మారుతి సుజుకీ నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన మొదటి కారు మోడల్ డిజైర్. గ్లోబల్ ఎన్సీఏపీ రేటింగ్స్‌ను ఇండియాలో కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.