న్యూఢిల్లీ : 2030–-31 నాటికి విదేశాలకు 7.5 లక్షల బండ్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మారుతీ సుజుకీ ఇండియా సోమవారం తెలిపింది. ఈ కంపెనీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు 30 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. వీటిలో సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, సియాజ్, డిజైర్, ఎస్-ప్రెస్సో వంటి మోడళ్లు ఉన్నాయి.
గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ నుంచి 1,053 యూనిట్లను రవాణా చేసిందని, మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) ఎండీ, సీఈఓ హిసాషి టేకుచి ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న ప్రయాణీకుల వాహనాల్లో 40 శాతం తమ కంపెనీకి చెందినవేనని తెలిపారు. భారతదేశం నుంచి తమ ఎగుమతులు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి మూడు రెట్లు పెరిగాయని ఆయన వెల్లడించారు.