కార్ల తయారీలో ప్రముఖ కంపెనీ మారుతి సుజుకీ రికార్డు సృష్టించింది. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కార్ల తయారీ కంపెనీ ఇప్పటివరకు 3కోట్ల కార్లను ఉత్పత్తి చేసింది. ఇటీవల తన సనంద్ ప్లాంట్ నుంచి 10 లక్షల కార్ల ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది.
1983లో స్థాపించబడి మొదట మారుతి M800తో ఉత్పత్తి ప్రారంభించిన టాటామోటార్స్ .. 40 సంవత్సరాల 4 నెలల్లో 3కోట్ల కార్లను ఉత్పత్తి చేసి రికార్డు బద్దలు కొట్టింది. గురుగ్రామ్, హర్యానాలోని మనేసర్ నుంచి మొత్తం 2.68 కోట్ల కార్లు ఉత్పత్తి చేయగా, మిగిలిన 32 లక్షల యూనిట్లు గుజరాత్ లోని హన్సల్ పూర్ యూనిట్ లో ఉత్పత్తి చేశారు.
మొదటి 10 లక్షల (1మిలియన్) కార్ల తయారీని 1994మార్చి లో సాధించించింది. 2005లో 50 లక్షల (5మిలియన్లు) మార్కును అతి తక్కువ కాలంలో చేరుకుంది. ఆ తర్వాత మార్చి 2011లో 1కోటి (10 మిలియన్ ) యూనిట్లకు ఉత్పత్తి చేరింది. 2018లో ఉత్పత్తి అత్యంత వేగంగా 2కోట్ల యూనిట్లకు చేరుకుంది. కేవలం మరో 6 సంవత్సరాల్లో అంటే ఏప్రిల్ 2024 నరాటికి కంపెనీ 3కోట్ల(30మిలియన్లు) యూనిట్ల మార్కును తాకింది.
టాటామోటార్స్ ..ఆల్టో 800, ఆల్టో కె 10, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, డిజైర్, ఓమ్ని, బాలెనో, ఈకో, బ్రెజ్జా, ఎర్టిగా వంటి మోడళ్లను ఉత్పత్తి చేసి 3వ అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయరీ సంస్థగా నిలిచింది.