న్యూఢిల్లీ: ఎంట్రీ- లెవల్ మోడల్స్ ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో ధరలను తగ్గించామని, కొన్ని వేరియంట్లకు మాత్రమే డిస్కౌంట్లు వర్తిస్తాయని మారుతీ సుజుకి ఇండియా సోమవారం తెలిపింది. ఎస్ప్రెస్సో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ధర రూ. 2,000, ఆల్టో కే10 వీఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 6,500 తగ్గినట్లు ఆటో మేజర్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఆల్టో కె10 ధరలు రూ. 3.99 లక్షలు నుంచి రూ. 5.96 లక్షలు వరకు ఉండగా, ఎస్-ప్రెస్సో ధరలు రూ. 4.26 లక్షల నుంచి రూ. 6.11 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉన్నాయి. ఎస్-ప్రెస్సోతో కూడిన కంపెనీ మినీ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు గత నెలలో 10,648 యూనిట్లకు పడిపోయాయి. ఏడాది క్రితం 12,209 యూనిట్లు అమ్ముడయ్యాయి.