కార్లు కొనేవాళ్లకు బిగ్ షాక్.. ఏప్రిల్ నుంచి రేట్లు పెరుగుతున్నాయ్..!

కార్లు కొనేవాళ్లకు బిగ్ షాక్.. ఏప్రిల్ నుంచి రేట్లు పెరుగుతున్నాయ్..!

కార్లు కొనేవాళ్లకు బిగ్ షాక్ ఇస్తున్నాయి కంపెనీలు. ఏప్రిల్ నుంచి రేట్లను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తు్న్నాయి. ముందుగా ఇండియాలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ రేట్లు పెంచేందుకు సిద్ధం అయ్యింది. జనవరి, ఫిబ్రవరీ నెలల్లో వరుసగా రేట్లను పెంచిన మారుతీ.. మరోసారి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. 


మధ్యతరగతికి, బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు అందించే మారుతీ కంపెనీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. కార్ల రేట్లను 4 శాతం పెంచుతున్నట్లు సోమవారం (మార్చి 17) ప్రకటించింది.  ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.  ఇన్ పుట్ కాస్ట్ పెరగడం, ఆపరేషనల్ ఖర్చులు పెరుగుతుండంతో కంపెనీపై భారం పెరుగుతోందని, అందుకోసం రేట్లు పెంచకుండా ఉండలేకపోతున్నట్లు ప్రకటించింది. 

జనవరీ 2025 లో 4 శాతం పెచడంతో కస్టమర్లపై భారం పడింది. అయితే ఇప్పుడు కూడా 1 నుంచి 4 శాతానికి పెంపు ఉండనుందని మార్కెట్ అంచనా.