నెంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ.. తన బ్రాండెడ్ కార్ల ధరలను పెంచేసింది. పెంచిన ధరలు 2025, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది కంపెనీ. గరిష్టంగా 32 వేల 500 రూపాయల వరకు పెంచింది మారుతీ సుజుకీ కార్ల కంపెనీ. ఏయో మోడల్ పై ఎంతెంత ధర పెరిగిందో తెలుసుకుందామా.. ఫిబ్రవరి 1, 2025 నుండి వివిధ మోడళ్లపై రూ. 32,500 వరకు ధరలను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది మారుతి సుజుకీ ఇండియా. పెరుగుతున్న ఇన్‌పుట్ ఎక్స్ పెన్సెస్, ఆపరేషనల్ ఎక్స్ పెన్సెస్ కారణంగా ఈ సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొంది సంస్థ.
ఏ మోడల్ పై ఎంత ధర పెరిగిందంటే:
- సెలెరియా కారు ధర 32 వేల 500 రూపాయల వరకు ధర పెరిగింది.
- న్వెక్టో మోడల్ కారు ధర 30 వేల రూపాయల వరకు పెరిగింది.
- అత్యధికంగా అమ్ముడయ్యే వ్యాగనర్ మోడల్ ధరను 15 వేల రూపాయల వరకు పెరిగింది.
- స్విఫ్ట్ మోడల్ పై రూ. 5,000 వరకు పెరగనుంది.
- SUV సెగ్మెంట్‌లో, బ్రెజ్జా, గ్రాండ్ విటారా ధరలు వరుసగా రూ. 20,000, రూ. 25,000 వరకు పెరుగుతుందని సమాచారం.
- ఆల్టో కె10 వంటి ఎంట్రీ-లెవల్ కార్ల ధరలు రూ. 19,500 వరకు పెరగనుండగా.. ఎస్-ప్రెస్సో రూ. 5,000 వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది.
- ప్రీమియం కాంపాక్ట్ మోడల్ బాలెనో ధర రూ. 9,000 పెరగనుంది.
- కాంపాక్ట్ SUV ఫ్రాంక్స్ రూ. 5,500 వరకు పెరుగుతుంది.
- కాంపాక్ట్ సెడాన్ డిజైర్ రూ. 10,000 వరకు పెరుగుతుంది.
మారుతి సుజుకి రూ. 3.99 లక్షలతో ప్రారంభమయ్యే ఎంట్రీ-లెవల్ ఆల్టో కె-10 నుండి రూ. 28.92 లక్షల ప్రీమియం ఇన్విక్టో వరకు వివిధ రకాల మోడళ్లను అందిస్తోంది. మరి, ధరల పెరుగుదల మారుతి సుజికి కార్ల అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.