
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో మారుతీ సుజుకీ సరికొత్త ఎడిషన్ ‘ న్యూ డిజైర్’ కారు అందుబాటులోకి వచ్చింది. బంజారాహిల్స్లోని వరుణ్ మోటర్స్ షోరూమ్లో ఈ కారును హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ సి.రమేశ్ మంగళవారం ముఖ్యఅతిథిగా హాజరై విడుదల చేశారు. కార్యక్రమంలో షోరూమ్ జీఎం కృష్ణా, డీజీఎం రామ్ కుమార్, ఎస్ఎం ప్రదీప్, సిబ్బంది పాల్గొన్నారు. కారు ధర రూ.6.79 లక్షల నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.