మారుతీ సుజుకి లాభం రూ. 3,102 కోట్లు

మారుతీ సుజుకి లాభం రూ. 3,102 కోట్లు

న్యూఢిల్లీ, వెలుగు: సెప్టెంబర్‌‌‌‌తో ముగిసిన రెండవ క్వార్టర్​లో తమ కన్సాలిడేటెడ్​ నికర లాభం వార్షికంగా 18 శాతం క్షీణించి రూ. 3,102 కోట్లకు చేరిందని మారుతీ సుజుకి ఇండియా మంగళవారం నివేదించింది. ఇండెక్సేషన్ ప్రయోజనం రద్దు కావడం, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌పై దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నురేటు మార్పులు ఇందుకు కారణమని పేర్కొంది. 

 దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ గత ఆర్థిక సంవత్సరం జూలై-–సెప్టెంబర్ క్వార్టర్​లో రూ.3,786 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.  రెండో క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా మొత్తం ఆదాయం రూ. 37,339 కోట్ల నుంచి రూ. 37,449 కోట్లకు పెరిగింది.  స్టాండ్‌‌‌‌లోన్ ప్రాతిపదికన, కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికానికి రూ. 3,069 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 3,716 కోట్లతో పోలిస్తే 17 శాతం తగ్గింది. కంపెనీ నికర అమ్మకాల విలువ రూ.35,535 కోట్ల నుంచి రూ.35,589 కోట్లకు పెరిగింది.