రెన్యువబుల్​ ఎనర్జీ వ్యాపారంలోకి మారుతీ సుజుకీ

రెన్యువబుల్​ ఎనర్జీ వ్యాపారంలోకి మారుతీ సుజుకీ

న్యూఢిల్లీ: సోలార్ పవర్,  బయోగ్యాస్‌‌‌‌‌‌‌‌ తదితర రెన్యువబుల్​ఎనర్జీ  ప్రాజెక్టుల కోసం రాబోయే మూడు సంవత్సరాల్లో రూ. 450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది.   2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెన్యువబుల్​ఎనర్జీ వర్టికల్‌‌‌‌‌‌‌‌లో రూ.120.8 కోట్లు పెట్టుబడి పెట్టింది.  2025 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్లలో ఈ పెట్టుబడిని నాలుగు రెట్లు పెంచి రూ. 450 కోట్లకు చేర్చనున్నట్లు కంపెనీ తెలిపింది. 

ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030-–31 నాటికి రెట్టింపు చేస్తామని తెలిపింది.  2025 ఆర్థిక సంవత్సరంలో మనేసర్ ప్లాంటులోనే బయోగ్యాస్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించనుంది.