మారుతీ సుజుకి కంపెనీలో కొత్త మోడల్ కారు షిఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది స్టన్నింగ్ లుక్స్ తో మినీ పవర్ ఫ్యాక్ లా కనిపిస్తోంది. స్విఫ్ట్ బ్లిట్జ్ మూడు ఎంట్రీ-లెవల్ LXi, VXi, VXi (O) వేరియంట్లను తయారు చేశారు. ఇందులో CNG మరియు AMT వేరియంట్‌లు కూడా ఉన్నాయి. మారుతి సుజుకి ఇంతకు ముందున్న అమ్మాకాలు పెంచుకోవడానికి కొత్తగా వచ్చే మోడల్లో స్పెషల్ టెక్నాలజీని యాడ్ చేస్తోంది. అంతేకాదు ఈ దీపావళి పండగ ముందు లాంచ్ చేసింది కాబట్టి.. భారీ డిస్కౌంట్ అవకాశం ఉందని అంచనా. షిఫ్ట్ బ్లిట్జ్ అప్ డేటెడ్ కాస్మెటిక్ ఎడిషన్. ఈ కారు స్పెసిఫికేషన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వీటి ధర ఇండియాలో ఎక్స్-షోరూమ్ రూ.6.49 నుంచి రూ.9.85 లక్షల మధ్య ఉంది. షిఫ్ట్ బ్లిట్జ్ కు అడిషనల్ రూ.50 వేలు విలువగల యాక్సెసరీస్ ఫ్రీగా ఇవ్వనున్నారు. ఇవి లిమిటెడ్ ఎడిషన్ కు మాత్రమే కస్టమర్లకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ తో కారుకు ప్రీమియం లుక్ వస్తుంది. ఈ ఎక్స్ట్రా యాక్సెసరీస్ వల్ల ఎంట్రీ-లెవల్ వేరియంట్ వెనిలా వేరియంట్ కంటే కొంచెం ఎక్కువ ప్రీమియం లుక్ ఉంటుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వెనుక అండర్‌బాడీ స్పాయిలర్ (అప్‌డేటెడ్ బంపర్), ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్స్, రియర్ అప్పర్ స్పాయిలర్, డోర్ వైజర్‌లు మరియు సైడ్ బాడీ క్లాడింగ్ ఉన్నాయి.
ALSO READ | ఇసుజు అంబులెన్స్వచ్చేసింది..ఆస్పత్రిలో సౌకర్యాలన్నీ ఇందులో ఉంటాయి
షిఫ్ట్ బ్లిట్జ్ 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో 82 hpని కలిగి ఉంది. ఈ ఇంజన్ 112 Nm హై టార్క్‌ను విడుదల చేస్తుంది. CNG వేరియంట్‌లలో 70 hp మరియు 102 Nm టార్క్ విడుదల చేస్తోంది. పెట్రోల్ వేరియంట్‌లు 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు బేస్ వేరియంట్ మినహా అన్నింటిలో 5-స్పీడ్ AMT ఎంపికతో అందుబాటులో ఉన్నాయి.