మహారాష్ట్రలో పెరుగుతున్న కొవిడ్ కేసులు

మహారాష్ట్రలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.ముందు జాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని అడిషనల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ప్రదీప్ వ్యాస్ తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు, ఆడిటోరియాలు, ఆస్పత్రులు, కాలేజీలు, పాఠశాలల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ కంట్రోల్ నే ఉందని..ఆస్పత్రుల్లో కేసులు తక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఇటీవల మహారాష్ట్రలో  BA.4, BA.5 సబ్‌వేరియంట్‌లతో రోగులను కనుగొన్నామని..ఈ కేసులకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాలేదన్నారు. 

మరిన్ని వార్తల కోసం

చెట్టు మీద పండ్లను ఇలా కోయచ్చా..! ఫిదా అయిన మహీంద్రా

కేసీఆర్ నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు