ఏంటి నిజమా ! ... మసూద్ అజహర్‌ చనిపోయాడా?

 జైషే మహ్మద్‌ చీఫ్‌, పుల్వామా దాడి మాస్టర్‌ మైండ్‌ మసూద్‌ అజహర్‌ చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అతనిపై బాంబు దాడి జరిగినట్లుగా..  ఈ దాడిలో మసూద్‌ మృతిచెందినట్లుగా కథనాలు వస్తున్నాయి.  2024  జనవరి 1వ తేదీన ఉదయం 5 గంటల ప్రాంతంలో పాక్‌లోని భవల్‌పూర్‌ మసీదు నుంచి మసూద్‌ తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై పాక్ మీడియా కూడా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. 

భారత్‌లో జరిగిన పలు భీకర దాడులకు మసూద్‌ అజహర్‌ కీలక సూత్రధారి. 1995లో భారత్‌ అతడిని అరెస్టు చేసింది. అయితే 1999లో విమానాన్ని హైజాక్‌ చేసిన ఉగ్రవాదులు అతడిని విడిపించుకున్నారు. ఆ తర్వాత అతడు జైషేను స్థాపించాడు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి, 2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ ఇతడి ప్రమేయం ఉంది.

2019లో జమ్మూకశ్మీర్‌లో పుల్వామాలో సైనికుల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి వెనుక మసూద్‌ మాస్టర్‌మైండ్‌ ఉందన్న ఆరోపణాలు ఉన్నాయి . ఈ ఘటన తర్వాత ఐక్యరాజ్యసమితి.. మసూద్‌ అజహర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.