చీర కొంగులో చిట్టీలు: గ్రూప్-1 మెయిన్స్‎ పరీక్షలో పట్టుబడిన మహిళా అభ్యర్థిని

చీర కొంగులో చిట్టీలు: గ్రూప్-1 మెయిన్స్‎ పరీక్షలో పట్టుబడిన మహిళా అభ్యర్థిని

హైదరాబాద్: అనేక ఆందోళనలు, నిరసనల అనంతరం.. న్యాయస్థానాల ఆదేశాలతో తెలంగాణలో తొలిసారిగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. 2024, అక్టోబర్ 22 నుండి మొదలైన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 25) నాలుగవ రోజు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎగ్జామ్ జరిగింది. అయితే, స్కూల్, కాలేజీల్లో కొందరు విద్యార్థులు చిట్టీలు (మాస్ కాపీయింగ్) కొట్టినట్లుగా.. స్టేట్ లెవల్‎లో హయ్యర్ ప్రవేశపరీక్ష అయిన గ్రూప్ 1 ఎగ్జామ్‎లో ఓ అభ్యర్థిని కాపీయింగ్‎కు పాల్పడి అడ్డంగా దొరికిపోయింది. 

వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్‎కు పాల్పడుతూ మహిళా అభ్యర్థిని అధికారులకు పట్టుబడింది. చీర కొంగులో చిట్టీలు తీసుకొచ్చి మాస్ కాపీయింగ్‎కు పాల్పడుతుండగా గుర్తించిన ఇన్విజిలేటర్ అధికారులకు సమాచారం అందించారు. 

ALSO READ | మూసీ పునరుజ్జీవం ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్: బండి సంజయ్

ఈ మేరకు అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. మాస్ కాపీయింగ్‎కు పాల్పడిన అభ్యర్థిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, కాపీయింగ్ పాల్పడిన అభ్యర్థినిది  మహబూబ్ నగర్ జిల్లా , పెద్ద మందాడి మండలంగట్ల ఖానాపూర్ గ్రామమని సమాచారం. ఆమె ప్రభుత్వ ఉద్యోగి అని తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.