
రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘తు మేరా లవర్’ అంటూ సాగే మొదటి పాటను ఈనెల 14న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. సింపుల్ డ్యాన్స్ మూమెంట్‌తో ఉన్న రవితేజ స్టిల్ ఆకట్టుకుంది.
రవితేజ కెరీర్‌లో ఇది 75వ చిత్రం. ఇందులో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంటే, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.