Vishwak Sen As Laila: లైలా మ్యాజికల్ ఐస్ చూశారా..విశ్వక్ లేడీ మేకోవర్ చూస్తే కుర్రాళ్లు పడాల్సిందే!

Vishwak Sen As Laila: లైలా మ్యాజికల్ ఐస్ చూశారా..విశ్వక్ లేడీ మేకోవర్ చూస్తే కుర్రాళ్లు పడాల్సిందే!

టాలీవుడ్ మాస్ కా దాస్  విశ్వక్ సేన్(Vishwak sen) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. రీసెంట్ గా విశ్వక్ గామీ సినిమాలో అఘోరా పాత్రలో నటించి మెప్పించాడు. అలాగే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఊర మాస్ లుక్ తో మరింత కొత్తగా కనిపించి యూత్ ని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ నటిస్తున్నరెండు సినిమాలు హాట్ టాపిక్ గా మారాయి. 

ఒకటి మెకానిక్ రాకీ(Mechanic Rocky) కాగా..రెండోవది లైలా (Laila). ఈ రెండు సినిమాల్లో లైలా సినిమా గురించి  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కారణం..విశ్వక్ కెరీర్ లో మొదటిసారి ఈ సినిమా కోసం లేడీ రోల్ లో కనిపించనున్నాడు. అందుకే ఆడియన్స్ లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. 

తాజాగా లైలా సినిమా నుంచి  అందమైన 'లైలా'గా విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజయింది.ఈ పోస్టర్ కి మేకర్స్ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. "ఆమె మాయా కళ్ళు, తన మనోహరమైన వ్యక్తిత్వం అందరినీ మంత్రముగ్దులను చేస్తాయి. దీంతో విశ్వక్ సేన్ ఫ్యాన్స్ లో తెగ ఇంట్రెస్ట్ పెరిగింది.రీసెంట్ గా లైలా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ వీడియో మెస్మరైజ్ చేసింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తో కుర్రాళ్ల గుండెల్ని అట్ట్రాక్ట్ చేసి పడేసింది. ఓ సారి లైలా వైపు లుక్కేయండి..మీరు కూడా పడిపోతారు. 

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. త్వరలో షూటింగ్ షురూ కానున్న ఈ సినిమా ఫిబ్రవరి 14, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.