శివ కార్తికేయన్ చెవిలో రవితేజ వాయిస్.. సినిమా మొత్తం అంతేనట

శివ కార్తికేయన్ చెవిలో రవితేజ వాయిస్.. సినిమా మొత్తం అంతేనట

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్(Shiva karthikeyan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మావీరన్(Maveeran). తెలుగులో ఈ సినిమాను మహావీరుడు(Mahaveerudu)గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మడోన్నే అశ్విన్(Madonne ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు యూనిట్.

ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుండి మరో ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోతో తెలుగు ఆడియన్స్ కు సూపర్ సర్ఫరైజ్ ఇచ్చారు మహావీరుడు టీమ్. అదేంటంటే.. ఈ ప్రోమోలో మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) వాయిస్ వినబడటమే. ఈ సినిమాలో శివ కార్తికేయన్ కు ఆకాశం నుండి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ చెప్పినట్టుగానే ఈ సినిమాలో హీరో పాత్ర ప్రవర్తిస్తూ ఉంటుందట. ఆ వాయిస్ కేవలం హీరోకు మాత్రమే వినిపిస్తుందట. అది వినిపించినప్పుడల్లా హీరో పైకి చూడటం అనేది ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ చేస్తోంది.   

ఇక సినిమా మొత్తం ఉండే ఈ వాయిస్ కోసం ఎవరైనా స్టార్ హీరో ఉంటే బాగుంటుందని భావించిన టీమ్ రవితేజను అప్రోచ్ అవ్వగా.. వేంటనే ఒక చెప్పేశాడట రవితేజ. దీనికి సంబందించిన డబ్బింగ్ కూడా ఇప్పటికే పూర్తిచేశాడట. ఇక రవితేజ పవర్ ఫుల్ వాయిస్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. ఇప్పటికే రవితేజ మర్యాద రామన్న(Maryada ramanna) సినిమాకు తన వాయిస్ అందించారు. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడం ఖాయం అంటున్నారు రవితేజ అండ్ శివ కార్తికేయన్ ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.