మాస్ రాజా రవితేజ (Ravi Teja) అంటే చాలా మందికి పీక్ లెవెల్లో అభిమానం.సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ను క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక లేటెస్ట్గా రవితేజ తన ఫ్యామిలీ ఫొటోస్ను సోషల్ మీడియాలో షేరు చేసుకున్నారు. మాస్ రాజా ఫ్యామిలీ అంతా జపాన్ ట్రిప్కు వెళ్లినట్లు తెలుస్తోంది.ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోస్ లో.. రవితేజ కొడుకు మహాదాన్, మోక్షదలతో పాటు తన తమ్ముడి కొడుకు కూడా కనిపిస్తున్నారు.
మాస్ రాజా ఈ ఫొటోస్కి ఇంట్రెస్టింగ్ ట్యాగ్ ఇస్తూ.. టోక్యోలో ఆర్టీసీ క్రాస్ రోడ్ మాదిరిగానే,..బట్ బోత్ ఆర్ నాట్ సేమ్..అంటూ మాస్ రాజా ట్వీట్ చేశారు.ఇక బయట చాలా రేర్గా కనిపించే రవితేజ ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చే సరికి ఫ్యాన్స్ మస్త్ ఖుషి అవుతున్నారు.
ప్రస్తుతం మాస్ రాజా ఫ్యామిలీ సోషల్ మీడియాలో జర్నీ చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ కూడా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మాదిరిగా ఫారెన్ ట్రిప్స్ స్టార్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్కు రవితేజ కొత్త అనుభూతిని ఇవ్వడానికి రెడీ అయ్యినట్టు తెలుస్తోంది.
Also Read :- పవన్ కుమ్మేశాడు.. కెరీర్లోనే ఇది బెస్ట్.. ఓజీపై వర్మ కామెంట్స్
మాస్ మహారాజ్ వరుస సినిమాలతో ఫామ్ లో ఉన్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) తో మరో మూవీ చేయడానికి రెడీ అయిన విషయం తెలిసేందే. వీరి కాంబో అంటే ఫ్యాన్స్ కు కిక్కేంచే వార్తా కావడంతో ఈ మూవీ పై ఆసక్తి కలిగిస్తోంది.అలాగే డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని(Kartik Gattamaneni) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ ఈగల్(Eagle). డిఫరెంట్ థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేసి క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. ఇక రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ దసరా స్పెషల్గా అక్టోబర్ 20న విడుదల అవనుంది.