భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు.
పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస్తులతో పాటు ఇరు పక్షాల నుంచి వచ్చిన వారందరికీ భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రమాదేవి, ఎల్డంది పూర్ణచందర్‌తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు, కొత్తగూడెం పట్టణంలోని పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు.