‘వీర సింహారెడ్డి’గా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు బాలకృష్ణ. దీంతో చిత్ర ప్రమోషన్స్ ను స్పీడప్ చేశారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. మూవీ ఈవెంట్ ఎప్పుడు నిర్వహిస్తారా ? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనిపై నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రైలర్ తో పాటు ఈవెంట్ ను త్వరలో ప్రకటన చేయనున్నట్లు తెలిపింది. సినిమా నుండి ‘మాస్ మొగుడు’ అనే మరో మాస్ డ్యూయెట్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ సాంగ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తు్న్న మూవీలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ కానుంది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, విజయ్ ‘వారసుడు’ కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. గతంలోనూ పలుమార్లు బాలయ్య, చిరు మధ్య పొంగల్ వార్ జరిగింది. మరి ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.