కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని నగల దుకాణంలో అర్ధరాత్రి ఎవరూ లేని టైంలో చోరీ జరిగింది. దుండగులు సీసీ కెమెరాలను పగలగొట్టి షాప్ లో ఉన్న సుమారు 10 కిలోల వెండి, 30 గ్రాముల గోల్డ్‌ను ఎత్తుకెళ్లారు. ఇవాళ పొద్దున్న షాపు ఓనర్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ లతో ఆధారాలను సేకరించారు. షాపు ఓనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ | కలెక్టరేట్లో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఈఈ