జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...డీసీఎం,తూఫాన్ వాహనం ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం, తుఫాను ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలోని కొడకండ్ల మండలం గిర్ని తండా దగ్గర జనగామ-సూర్యపేట ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. జనగామ సూర్యాపేట హైవేపై  గురువారం ( జనవరి 9, 2025 ) అర్ధరాత్రి డీసీఎం,తూఫాన్ వాహనం ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ALSO READ : ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు  క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మృతులు సూర్యపేట జిల్లా ఈటూరు గ్రామానికి చెందినవారని.. మృతులు పేరాల జ్యోతి,పేరాల వెంకన్న భార్యాభర్తలుగా గుర్తించినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.