
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామచంద్రాపురం జాతీయ రహదారి పక్కన వున్న పుట్ పాత్ సెంటర్ పైకి ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ అతివేగంగా నడుపుతూ అర్ధరాత్రి పుట్ పాత్ పైకి బస్సుతో దూసుకొని వచ్చాడు. అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందగా దాన్ని గమనించిన కొంతమంది పరుగులు తీసి తమ ప్రాణాలు కాపాడుకున్నారు.
మృతి చెందిన వ్యక్తిని రామచంద్రాపురం నివాసిగా, బీడీఎల్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్న యాదయ్యగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి యాదయ్య మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా లేదా మద్యం తాగి వాహనం నడుపుతున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.