కాంగ్రెస్‌‌‌‌లోకి భారీగా చేరికలు

కాంగ్రెస్‌‌‌‌లోకి భారీగా చేరికలు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు

 పెద్దపల్లి, వెలుగు:  పెద్దపల్లి  జిల్లా మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం  బీఆర్ఎస్‌‌‌‌, ఇతర పార్టీలకు చెందిన లీడర్లు, కార్యకర్తలు  ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు సమక్షంలో  కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి లైబ్రరీ సంస్థ మాజీ డైరెక్టర్ గుడిసె గట్టయ్య,  శ్రీనివాస్ గౌడ్, పెయ్యాల తిరుపతి, దామోదర్ రెడ్డి లతో పాటు సూరయ్యపల్లి గ్రామానికి చెందిన 20మంది, ఖానాపూర్, కన్నాల గ్రామాలకు చెందిన సుమారు 100 మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ, మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, లీడర్లు శశి భూషణ్ కాచే,  బండారి  ప్రసాద్, కొత్త  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.