
వనపర్తి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం నుంచి 130 మంది పైగా వివిధ పార్టీల నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు. గోపాలపేట మండలం తాడిపత్రి, నర్సింగాయిపల్లి గ్రామాల నుండి జోగు శాంతన్న , అతని అనుచరులు బీఆర్ఎస్, బీజేపీ నుంచి చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నామని ప్రకటించారు. పార్లమెంట్ ఎలక్షన్ లో రాష్ట్రంలో అత్యధిక సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని అన్నారు. కార్యక్రమంలో గోపాలపేట మండల అధ్యక్షులు గణేశ్ గౌడ్, బి కృష్ణ, కౌన్సిలర్ పద్మ పరుశురాం, నరసింహ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.