మహారాష్ట్రలోని భాంద్రా జిల్లా భారీ పేలుడు సంభవించింది. ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం (జనవరి 24) ఉదయం శక్తివంతమైన పేలుడు జరగడంతో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుతో భారీ శబ్ధం వినిపించినట్లు కార్మికులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పేలుడు ప్రదేశంలో రెస్క్యూ, మెడికల్ టీమ్‌లు రంగంలోకి దిగి ప్రాణాలతో బయటపడిన వారి కోసం గాలిస్తున్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించి అక్కడ పనిచేస్తున్న కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.