CSK vs RCB: చెన్నై ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రూ.13 కోట్ల ప్లేయర్ మ్యాచ్ నుంచి ఔట్

CSK vs RCB: చెన్నై ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రూ.13 కోట్ల ప్లేయర్ మ్యాచ్ నుంచి ఔట్

ఐపీఎల్ లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రెండ్లు జట్లు శుక్రవారం (మార్చి 28) తలపడుతున్నాయి. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న CSK , RCB మ్యాచ్ కోసం చెపాక్ స్టేడియం సిద్ధమైంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం రెండు జట్లు వ్యూహాలను, అస్త్రశస్త్రాలను సిద్ధం చేశాయి. మోస్ట్ ఫేవరెట్ జట్లలో ఎవరు గెలుస్తారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

చెన్నై సపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు ముందు చెన్నై ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. చెన్నై ఫ్రాంఛైజ్ 13 కోట్ల రూపాయలు పెట్టి కొన్న ప్లేయర్ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడం ఫ్యాన్స్ ను కలవర పెడుతోంది. RCB తో జరిగే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లో చెన్నై ఫాస్ట్ బౌలర్ మతీశా పతిరణ అందుబాటులో ఉండటం లేదు. 

ప్రి మ్యాచ్ ప్రెస్ మీట్ లో భాగంగా.. CSK హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. పతిరణ ఇంకా గాయాల నుంచి కోలుకోలేదని, ప్రస్తుత మ్యాచ్ లో ఆడటం లేదని తెలిపారు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో కూడా పతిరన మ్యాచ్ కు దూరంగానే ఉన్నాడు. 

ALSO READ | IPL 2025 : ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్స్ హంగామా.. ఉర్రూతలూగిన కుర్రోళ్లు

గత ఐపీఎల్ (IPL 2024) లో అద్భుతమైన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకున్న పతిరణను CSK 13 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. అయితే గాయాల కారణంగా ఈ మ్యాచ్ స్క్వాడ్ లో పతిరణ లేకపోవడం ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే అంశం గా చెప్పవచ్చు. 

ఈ మ్యాచ్ గురించి కోచ్ ఫ్లెమింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘CSK గానీ.. RCB గానీ.. గత ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా అంచనా వేయలేం. RCB కి విరాట్ కోహ్లీ బిగ్ స్ట్రెంత్.. అతనితో పాటు ఈ సారి టీమ్ బలంగా ఉంది. చెన్నై కూడా చిన్న చిన్న మార్పులతో బలంగా ఉంది. ఎవరి బలాబలాలు ఏంటన్నది గ్రౌండ్ లోనే చూడాలి’’ అని అన్నారు.