జగిత్యాల జిల్లా: జగిత్యాల పట్టణంలోని 15వ వార్డ్ శివాజీ వాడలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దూరి చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.6 లక్షల విలువగల నగలు, రూ.30వేల నగదు దొంగలించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దసరా పండుగ సందర్భంగా సొంత ఊరు కరీంనగర్ వెళ్లగా.. తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. అక్టోబర్ 10న రాత్రి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి నగదు, నగలు ఎత్తుకెళ్లినట్టు బాధితుడు తోట ప్రసాద్ తెలిపాడు. క్లూస్ టీం, పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.