ఎయిర్పోర్ట్లో మెకానిక్ ఉద్యోగాలు.. బారులు తీరిన నిరుద్యోగులు..

ముంబైలోని కలినా విమానాశ్రయంలో మెకానిక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. 2,216 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఎయిర్పోర్టుకు క్యూ కట్టారు. పెద్దఎత్తున అభ్యర్థుల రావడంతో ఎయిర్పోర్ట్ రిక్రూట్మెంట్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రేంజ్ లో అభ్యర్థుల తాకిడి ఉంటుందని ఊహించని ఎయిర్పోర్ట్ సిబ్బందికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని హ్యాండిల్ చేయటం తలనొప్పిగా మారింది. దీంతో చేసేదేమీ లేక రెజ్యూమ్స్ ని ఆఫీస్ లో ఇచ్చి వెళ్లాలని, తర్వాత షార్ట్ లిస్ట్ చేసి కాల్ చేస్తామని తెలిపారు సిబ్బంది.

ALSO READ : ఐఎస్​ఎస్​కు దీటుగా స్వదేశీ స్పేస్​ స్టేషన్​

 

రెజ్యూమ్స్ ఇచ్చి వెళ్ళమని సిబ్బంది ఎంత చెప్పినా అభ్యర్థుల వినకపోవడంతో ఎయిర్పోర్ట్ దగ్గర గందరగోళం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మెకానిక్ పోస్టు కోసం ఇంత మంది క్యూ కట్టారంటే దేశంలో నిరుద్యోగిత ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పటానికి ఇది నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.