కోరుట్లలో భారీ సైబర్ క్రైం.. రూ.4 కోట్లు మాయం

కోరుట్ల, వెలుగు :  జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తి దగ్గర సైబర్ ​క్రిమినల్స్​ రూ.4 కోట్ల 25 లక్షలు కాజేశారు. పోలీసులు ఎన్నికల డ్యూటీలో ఉండడంతో పూర్తి వివరాలు చెప్పలేదు. కోరుట్లకు చెందిన మెకానికల్ ఇంజినీర్ రిటైర్డ్ అయి తిరుపతిలో ఉంటున్నాడు. కొద్ది రోజుల కింద ఓ వ్యక్తి ఫోన్​ చేసి తాను మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్​ఆఫీసర్​అని చెప్పాడు. ‘మీరు అక్రమంగా డబ్బులు సంపాదించారని ఫిర్యాదులు వచ్చాయి.

మీపై సీబీఐ ఎంక్వైరీ మొదలైంది. మీ బ్యాంకు అకౌంట్, ఇతర  వివరాలు చెప్పండి’ అని అడగడంతో ఆధార్ కార్డు , పాన్​కార్డుతో పాటు డిటెయిల్స్​ ఇచ్చాడు. తర్వాత అతడి అకౌంట్ నుంచి దశల వారీగా రూ. 4 కోట్ల 25 లక్షల క్యాష్​మాయమైంది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన అతడు 2 రోజుల క్రితం కోరుట్ల పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఎస్సై కిరణ్​కుమార్ మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.