
రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. మైలార్దేవ్ పల్లిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టేపల్లి, దుర్గానగర్చౌరస్తా వద్ద ఇద్దరు డ్రగ్స్ విక్రయిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులు జిమ్ ట్రైనర్ నితీష్, రాహుల్, సోహెల్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సీజ్ చేశారు. పట్టుబడ్డ ఇంజక్షన్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, ప్రధాన సూత్రదారి ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.