
- అమెరికా నుంచి అక్రమ మార్గంలో హైదరాబాద్‌కు..
- ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్
బషీర్‌బాగ్, వెలుగు: కాచిగూడ రైల్వే స్టేష్టన్ సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో బుధవారం ఈ కేసు వివరాలను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి వెల్లడించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్, స్కోడా కారు నుంచి సరుకు మార్పిడి చేసుకుంటున్నారు. వారిపై అనుమానం రావడంతో ఎస్టీఎఫ్ బీటీమ్, ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
కారులో 500 గ్రాముల ఓజీ కుష్, ఒక కేజీ గంజాయి, 6 గ్రాముల చరస్, 4.38 గ్రాముల హషీష్ సింథాటిక్ డ్రగ్స్‌తో పాటు ఐదు విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు ప్రతిష్ బట్, జైసూర్యను అరెస్టు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా పండించే ఓజీ కుష్నుఅక్రమ మార్గంలో ఇండియాకు దిగుమతి చేసి, బెంగూళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్నారు.
గంజాయి సప్లయర్‌గా జెప్టో డెలివరీ బాయ్
గచ్చిబౌలి : గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో గంజాయి సరఫరా చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన రంజిత్ (21) సిటీలో జెప్టో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. షామీర్ పేట్ మండలం కేశవరంలోని ఓ వ్యక్తి వద్ద రంజిత్ బుధవారం గంజాయి కొనుగోలు చేసి, గచ్చిబౌలికి వచ్చాడు. విశ్వసనీయ సమాచారంతో అతడిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 250 గ్రాముల గంజాయి సీజ్ చేశారు.