- సునామీ హెచ్చరికలు జారీ
వాషింగ్టన్: అమెరికాలోని అలస్కా సమీపంలో భారీ భూకంపం సంభ వించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.2గా నమోదైందని జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ‘‘శనివారం రాత్రి 10:48 గంటలకు భూకంపం సంభవిం చింది. అలస్కాలోని శాండ్ పాయింట్ కు 106 కిలోమీటర్ల దూరంలో 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించాం.
ALSO READ :జీస్ గ్రూప్ రూ.2,500 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్
అలస్కా ద్వీపకల్పం, అలూటియన్ దీవులు, కుక్ ఇన్ లెట్ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి” అని తెలి పింది. అయితే ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు తెలియరాలేదు. కాగా, భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత హెచ్చరికలను ఉపసంహరించింది.