చత్తీస్ గఢ్ గరియాబంద్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బాలగాలకు ఎలాంని నష్టం జరగలేదు.
మంగళవారం (21 జనవరి) ఉదయం చత్తీస్ గఢ్, ఒడిశాలో భద్రతా బలగాలు జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు, బలగాలకు మధ్య తీవ్ర కాల్పు జరిగాయి.
అంతకు ముందు సోమవారం చత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.