ఛత్తీస్‎గఢ్‎లో మరో భారీ ఎన్ కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‎గఢ్‎లో మరో భారీ ఎన్ కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి

రాయ్‎పూర్: ఛత్తీస్ గఢ్‎లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో శనివారం (ఫిబ్రవరి 1) భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మరికొందరు మావోయిస్టులు గాయపడ్డారని తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఘటన స్థలంలో ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టులు వివరాలు తెలియాల్సి ఉంది.

బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల సంచరిస్తున్నారన్న ఇంటలిజెన్స్ సమాచారంతో భద్రతా దళాలు శనివారం తెల్లవారుజూము నుంచే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలు ఎదురు పడ్డారు. దీంతో మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో తిరిగి జవాన్లు ఫైరింగ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా దళాలు 8 మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. మరికొందరు నక్సలైట్లు గాయపడ్డారని చెప్పారు.

ఘటన స్థలంలో మావోయిస్టుల ఆయుధాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్లో 16 మంది మావోయిస్టులు హతం అయ్యారు. అందులో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ చలపతి కూడా ఉన్న విషయం తెలిసిందే. చలపతి వంటి టాప్ లీడర్ ను కోల్పోయిన మావోయిస్టు పార్టీకి రోజుల వ్యవధిలోనే మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజా ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.