Massive federal layoffs: అమెరికాలో భారీగా ఉద్యోగుల తొలగింపు..10వేల మంది బ్యూరోక్రాట్లు ఔట్

Massive federal layoffs: అమెరికాలో భారీగా ఉద్యోగుల తొలగింపు..10వేల మంది బ్యూరోక్రాట్లు ఔట్

అమెరికా ప్రభుత్వంలోని అధికారుల తొలగింపులుకొనసాగుతున్నాయి.తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్,ప్రభుత్వ ముఖ్యసలహాదారు ఎలాన్ మస్క్ ల నేతృత్వంలో 9వేల 500మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించారు.

అంతర్గత వ్యవహారాలు, ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్యం వంటి రంగాల్లో ఉద్యోగులు లక్ష్యంగా తొలగింపులు చేపట్టారు. వచ్చేవారం పన్నుల వసూలు చేసే సంస్థ, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ నుంచి వేలాది మంది కార్మికులను తొలగించేందుకు సిద్దమవతున్నట్లు తెలుస్తోంది. 

ALSO READ | రెండో బ్యాచ్ కింద 119 మంది అమెరికా నుంచి బయల్దేరిన స్పెషల్ ఫ్లైట్

యూఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులు స్వచ్చందంగా ఉద్యోగం వదిలేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ట్రంఫ్ ఆఫర్ తో దాదాపు 75వేల మంది స్వచ్చందంగా ఉద్యోగాలను వదిలారు. శనివారం చేపట్టిన తొలగింపులు వీరికి అదనం. ఇప్పటివరకు తొలగించ బడిన ఉద్యోగులు అమెరికా ఉద్యోగుల్లో 3శాతం.