జోగిపేట ఏరియా హాస్పిటల్​లో అగ్నిప్రమాదం

జోగిపేట ఏరియా హాస్పిటల్​లో అగ్నిప్రమాదం

జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా హాస్పిటల్​ స్టోర్  రూమ్​లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్​ సర్క్యూట్​తో అనూహ్యంగా మంటలు ఎగిసి పడడంతో స్టోర్  రూమ్ లో భద్రపరిచిన మెడిసిన్స్, సర్జికల్​ ఎక్విప్​మెంట్స్, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా, ఫైర్ ఇంజన్ తో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. 

మందులు కాలిపోవడంతో పరిసర ప్రాంతం పొగతో నిండిపోయింది. స్టోర్​రూమ్​ ఆసుపత్రికి కొంచెం దూరంలో ఉండడంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈ ప్రమాదంలో రూ.2 లక్షల విలువైన మెటీరియల్  దగ్ధమైనట్లు డీసీహెచ్​వో సంగారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్  డాక్టర్  సౌజన్య తెలిపారు. ఘటనా స్థలాన్ని జోగిపేట ఆర్డీవో పాండు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.