
నల్లగొండ జిల్లా :- మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం (మార్చి 27) సాయంత్రం మొదలైన మంటలు ఇప్పటికీ చల్లారడం లేదు. మంటలు ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు అంటుకుంటూ దవానంలా వ్యాపిస్తున్నాయి. యూనివర్సిటీ చుట్టూ మంటలు వ్యాపించడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు విద్యార్థులు.
ఈ ప్రమాదంలో సుమారు100 ఎకరాల వరకు చెట్లు కాలిపోయాయి. మంటలు భారీ ఎత్తున ఎడసిపడుతున్నాయి. యూనిర్సిటీ మొత్తాన్ని పొగ కమ్మేసింది. దీంతో భయాందోళన పరిస్థితులు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో నెలకొన్నాయి. యూనివర్సిటీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంతో గత మూడు గంటలుగా హాస్టల్లో కరెంటు లేదు. దీంతో విద్యార్థులు చీకట్లోనే మగ్గుతున్నారు.
Also Raed : ఆవుకు అంత్యక్రియలు
విద్యార్థులు, సిబ్బంది పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. ఫైర్ ఇంజన్ తో మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.